Dr. Brain
ఈ సిరీస్‌ను మహోన్నత దర్శకుడు అయిన కిమ్ జీ వూన్ సమర్పిస్తున్నారు. మెదడుకు సంబంధించిన గొప్ప శాస్త్రవేత్త అయిన సివోన్ (లీ సన్ గ్యున్) జీవితంలో ఒక ఘోరమైన విషాదం చోటుచేసుకుంటుంది. తన కుటుంబానికి ఏం జరిగిందో తెలుసుకోవడానికి నడుము కట్టి, ఆధారాల కోసం జ్ఞాపకాలను పొందడానికి ఆయన శవాలతో "బ్రెయిన్ సింక్‌ల" ప్రక్రియని చేస్తుంటాడు.