ద పెరిఫరల్
ఒక అప్పలాషియన్ ఊళ్ళో ఉంటున్న ఒక యువతి విసుగు చెందకుండా ఉండేందుకని అడ్వాన్స్ డ్ వీడియోగేమ్స్ ఆడుతుంది. ఒక కంపెనీ, ఓ కొత్త వీడియోగేం సిస్టంని పరీక్షించేందుకని ఆమెను పంపిస్తుంది. కానీ కొన్ని విడ్డూరాలు జరుగుతాయి. గేం అనుకున్న చోట.. ఆమెకు ఒక లక్ష్యం, రొమాన్స్, గ్లామర్ గురించిన కలలన్నీ వెల్లడి అవుతాయి. కానీ అదే ఆమెని, కుటుంబాన్ని అపాయం పాలుచేస్తుంది.
